బిచ్కుంద (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పబ్లిసిటీ కో ఛైర్మన్, జుక్కల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సౌదాగర్ గంగారాంకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని పెద్ద కొడప్గల్ సౌదాగర్ గంగారాం స్వగృహంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకోవడం జరిగింది. శుభాకాంక్షలు తెలిపిన వారిలో గోనె యాదయ్య, శివరాజ్ పాటిల్, మోయిన్, దర్పల్ గంగాధర్, విరేందర్, సిర్సముందర్ గంగాధర్ మరియు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




