కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మర్రి జనార్దన్ రెడ్డి ఖబడ్దార్
ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 :ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు, తిరిగే హక్కు భారత రాజ్యాంగం కల్పించబడిందని తెలియక విజ్ఞతను కోల్పోయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మర్రి జనార్దన్ రెడ్డి ఖబడ్దార్ తస్మాత్ జాగ్రత్తని అలంపూర్ తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యస్ ఎ దీపక్ ప్రజ్ఞ ఆదేశాల మేరకు అలంపూర్ తాలూకా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆయన పై ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని ఎస్సై అశోక్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగుల రవి మాట్లాడుతూ ఒక నియోజకవర్గానికి శాసన సభ్యులుగా ఉండి బిఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే కాల్చిపడేస్తానని అనడం ఎంతవరకు సమంజసం అన్నారు. కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకి పెరుగుతున్న ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటన్న, అంజి, ఇటిక్యాల సంపత్, వినోద్, రాజు, సంధ్య బాబు తదితర కార్యకర్తలు ఉన్నారు.