కాంగ్రెస్ మండల అధ్యక్షునికి తప్పిన పెను ప్రమాదం

చేర్యాల (జనంసాక్షి) జులై 12 : కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులు, చుంచనకోట గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి గ్రామం నుండి చేర్యాల వైపు స్వగృహనికి వెళ్తున్న క్రమంలో తన స్విఫ్ట్ డిజైర్ కారు బండపల్లి క్రాస్ రోడ్డు మూల మలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన వ్యవసాయ భూమిలోకి దూసుకెళ్లి బోల్తా పడగా కారు నుజ్జునుజ్జయింది. ఆది శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో ఉపిరి పీల్చుకున్నారు