కాంగ్రెస్ లో చేరిన దౌల్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్.

దౌల్తాబాద్ ఆగష్టు 14, జనం సాక్షి.

దౌల్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు డాకోళ్ల ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.హైదరాబాద్ లోని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఆయనతో పాటు బిఆర్ఎస్ నాయకులు గొల్ల రమేష్,మినుగు రాజు,కుమ్మరి శ్రీనివాస్,మొద్దు రమేష్, పోషమైన సత్తయ్య,తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్నది కాంగ్రేస్ ప్రభుత్వమే అని దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యేగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నాడని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారు లాలు,దౌల్తాబాద్ మాజీ సర్పంచులు ఆది వేణుగోపాల్,మాదంశెట్టి భద్రయ్య,గొడుగుపల్లి మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి నాయకులు పడాల మల్లేశం,మర్కంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు