కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి

సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి
మండలం( జనం సాక్షి )

సిమెంట్ పరిశ్రమలలో నుటికి 70 నుంచి 80 శాతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి బోనస్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత లేదని కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి ఆరోపించారు.
పరిశ్రమలలో సర్వేలో భాగంగా ఈరోజు రాంపురం ప్రియా సిమెంట్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికుల సర్వే సందర్భంగా రోషపతి మాట్లాడుతూ కార్మికుల నుండి అనే విషయాలు తెలిపినారని అన్నారు, ఒక పరిశ్రమ లాభంతో నడుస్తున్నప్పుడు అందులో శ్రమ చేసే కష్టం చేసే శ్రమజీవులకి ఏజ్ బోర్డ్ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని కోరారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణతో  తీసుకొచ్చిన కార్మిక కోడ్ లతో బానిసత్వంలోకి నెట్టే కార్మిక కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని కోరారు కార్మికుల సర్వే ద్వారా వచ్చిన సమస్యలపై చలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఈనెల 26న పెద్ద ఎత్తున కార్మికుల కదిలి రావాలని కోరారు. ఆదాయం పన్ను పరిధిలోకి రాని ప్రతి కుటుంబానికి ప్రతి నెల 7500/- ఇవ్వాలని కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కృష్ణపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ తీగల శ్రీను నాగేశ్వరరావు గిరి ప్రకాష్ అజముద్దీ ను రామకృష్ణ నాగేశ్వరావు లక్ష్మయ్య అంకారావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు