కాంట్రాక్ట్ టీచర్స్ జీతాలు వెంటనే ఇవ్వాలి

టీఎస్ యుటిఎఫ్ డిమాండ్

టేకులపల్లి ,ఆగస్టు 1( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్ కి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం విచారకరమని వెంటనే జీతాలు విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బాలు నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో రాష్ర్టంలో సుమారు 1800మంది పనిచేస్తున్నారు.ఇందులో 190మంది ఐ టి డి ఎ పరిధిలోని స్కూల్ లలో కాంట్రాక్ట్ టీచర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.వీరికి గత 5నెలల నుండి జీతాలు రావడం లేదని కాంట్రాక్ట్ టీచర్స్ రాందాస్, రమేష్,శివ,ఏ. రాందాస్ లు టేకులపల్లి మండల టి ఎస్ యు టి ఎఫ్ మండల అధ్యక్షులు బాలు నాయక్ కు తమ జీతాలు సమస్యను వివరించి తమకు మద్దతు తెలిపి జీతాలు ఇప్పించడానికి కృషి చేయాలని వారు కోరారు.ఈ సమస్యను ఐ టి డి ఎ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వారు అన్నారు.