Tuesday, 3 November 2026

కాకా రాజకీయ భీష్ముడు :సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : మాజీ ఎంపీ స్వర్గీయ వెంకటస్వామి(కాకా) రాజకీయ భీష్ముడు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1969లో బుల్లెట్ దెబ్బ తిన్నా తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. చివరి క్షణం వరకు తెలంగాణ కోసం పరితమిపంచారని.. తెలంగాణ చూసే కన్నుమూయాలని కాకా కోరుకున్నారని పేర్కొన్నారు. కాకా జన్మధన్యమైందని.. ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన నేత కాక అని కేసీఆర్ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *