Thursday, 5 November 2026

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.40లక్షల సాయం: మంత్రి నాయిని

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్‌ నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్‌.ఐలను పరామర్శిచిన అనంతరం ¬ం మంత్రి మీడియాతో మాట్లాడారు. మృ తిచెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ప్రభుత్వం తరతపున రూ.40లక్షల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు. సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులు కూడా వీరేనని నిర్థరించినట్లు వెల్లడించారు. దోపిడీ దొంగల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *