ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరాల విషయంలో దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో.. గోవా ప్రభుత్వం ఈ కేసునుప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో షాపు ఉద్యోగులు కరీం లఖాని, ప్రశాంత్ నాయక్, రాజు ప్రాంచే, ప్రకాష్ భగత్ అనే నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ తెలిపారు.




