నాంపల్లి అక్టోబర్ 23 (జనం సాక్షి )నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం తమ కాన్వాయ్ తో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండల కేంద్రానికి వస్తుండగా ఆమె కాన్వాయ్ కి అడ్డుగా పెట్టిన బిజెపి నాయకుల వాహనం పలుమార్లు హారను కొట్టిన సైడు ఇవ్వకపోవడంతో, ఓవర్టేక్ చేసి వాహనాన్ని నిలిపి వారితో మాట్లాడడంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దుశ్చర్య పదజాలంతో బిజెపి నాయకులు తమ డ్రైవర్ కెమెరామెన్ లపై దురుసుగా ప్రవర్తించి దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని నిరసన తెలుపుతూ స్థానిక చౌరస్తాలో కొద్దిసేపు కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. కాన్వాయ్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై ఎస్పి రేమా రాజేశ్వరి కి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పామని అన్నారు. మహిళా అని చూడకుండా మాట్లాడడాన్ని వారి ప్రవర్తన తీరుపై అహంకార పోకడలకు ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలోములుగు ఎమ్మెల్యే సీతక్క, పార్టీ టీపిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత,జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, దామెర సర్పంచ్ దామర యాదగిరి, కొమ్ము బిక్షం, దుబ్బ యాదయ్య, నాంపల్లి సంజీవ, జగ్గారెడ్డి, జిల్లా నరసింహ, శ్రీశైలం, కుమార్, శ్రీధర్, విజయ్, అంజి, కాటిక మహేష్, దేవేందర్, కొండల్, మట్టపల్లి యాదయ్య తదితరులుపాల్గొన్నారు.
కాన్వాయ్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన పాల్వాయి స్రవంతి




