పతంజలి మెగా మార్ట్ ను ప్రారంభించారు జంపన ప్రతాప్

కంటోన్మెంట్ అక్టోబర్ 23 జనం సాక్షి కంటోన్మెంట్ బోర్డు ఆరవ వార్డ్ మల్లిక మోటార్స్ సమీపంలో వినాయక టవర్స్ హల్దీరామ్ షోరూం పక్కన పతాంజలి ఆయుర్వేదిక్ మార్ట్ ,పతంజలి వెల్నెస్ సెంటర్, పతంజలి మెగా మార్ట్ ను జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు,
దీర్ఘకాల వ్యాధులకు ప్రాచీన ఆయుర్వేద యోగ పద్దతిలో చికిత్స అందించేందుకు ప్రజలకు అందుబాటులో పతంజలి వెల్నెస్ యోగ ఆయుర్వేద నేచురోపతి కేంద్రంను ప్రముఖ వ్యాపారవేత్త త్యాగి ఏర్పాటు చేయడం అభినందనీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు, ఆయుర్వేదిక్ మార్ట్ ,పతంజలి వెల్నెస్ సెంటర్, పతంజలి మెగా మార్ట్ ను జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు త్యాగి,నేచురోపతి ఫిజిసియన్ ప్రముఖ డాక్టర్ భార్గవ్ మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్ పంచకర్మ, అభ్యన్గన,శిరోధార, పోట్లీ మస్సజే, వస్తిబస్తీ, స్టెమ్ బాత్, హైడ్రోథెరపీ ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయని వ్యాదిని బట్టి మూడు రోజుల నుండి నెల రోజుల పాటు చికిత్స అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట స్వామి, మేనేజర్ అమన్ తదితరులు పాల్గొన్నారు.