ఫొటో : ఆర్థికసాయం అందజేస్తున్న బీజేపీ నాయకులు.
బెల్లంపల్లి, మార్చ్ 21, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన కాన్సర్ బాధిత కుటుంబానికి మంగళవారం బీజేపీ నాయకులు ఆర్థికసాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన తుత్తుర్ల రాజం – లక్ష్మి దంపతుల్లో రాజం పక్షవాతం వచ్చి మంచానికే పరిమితం కాగా, లక్ష్మి కాన్సర్ తో బాధపడుతుంది. చదువుకునే వయస్సు గల పిల్లలు కూలి పనులకు వెళ్లి తల్లిదండ్రులను చూసుకుంటున్న కథనం పత్రికల్లో రావడంతో బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు తోడే వంశీకృష్ణ మరియు నెన్నెల మండల గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ గౌడ్ బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల నగదు అందజేశారు. ఈకార్యక్రమంలో నెన్నెల సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్, ఉప సర్పంచ్ పుప్పాల అంజన్న, వార్డు సభ్యుడు గోవింద్ సింగ్, పాత్రికేయుడు గౌసోద్దీన్, బీజేపీ కార్యకర్త మిట్ట వెంకటేష్ పాల్గొన్నారు.
కాన్సర్ బాధిత కుటుంబానికి ఆర్థికసాయం.




