…
బిఎల్ పి,రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిఎల్ఎఫ్, రాష్ట్ర నాయకులు, యస్, సిద్దిరాములు..
కామారెడ్డి ప్రతినిధి (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో
గత నెల రోజులుగా
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి,బిఎల్ఎఫ్, బిఎల్ టీయూ, ల ఆధ్యర్యంలో ప్రజలు డబుల్ బెడ్ రూం కోసం ఉద్యమిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే,
జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి మూలంగానే,
నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళా రజియా
గత నెల రోజులుగా
డబుల్ బెడ్ రూం ఉద్యమంలో పాల్గొంటున్నారు.
బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి,బిఎల్ఎఫ్, బిఎల్ టీయూ, ల ఆధ్యర్యంలో ప్రజల ఉద్యమం ఫలితంగా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు లిస్ట్ ను
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రకటించారు.
ఆ లిస్టులో రజియా పేరు లేకపోగా, ప్రతి కౌన్సిలర్ కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూం వచ్చిందని,
ఆవేదన వ్యక్తం చేస్తూ
ఈ సందర్భంగా ఆమెకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ తీసుకువెల్తున్న క్రమంలో ఆమె మార్గమధ్యంలో మృతి చెందారు.
నిరుపేద రజియాకు ఇద్దరు పిల్లలు వికలాంగులు,ఒక అమ్మాయి బీడీ కార్మికులుగా
పని చేస్తున్నారు.
ఆమె మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
డబుల్ బెడ్ రూం రాలేదు అని అవేదనకు గుర్తె గుండె పోటుతో మృతి చెందిన రజియ కుటుంబంకు రాష్ట్ర ప్రభుత్వం 25,లక్షలు రూపాయలు ,మరియు కామారెడ్డి లో డబుల్ బెడ్ రూం ఇచ్చి అను కోవాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి లో డబుల్ బెడ్ రూం ఉద్యమంలో గుండె పోటుతో మృతి చెందిన రజియా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి




