ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన చేరికపై టీఆర్ఎస్ లో సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్ర శేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.




