Wednesday, 4 November 2026

డివైడర్ ను ఢీకొన్న టవేరా ..ఇద్దరు మృతి

మెదక్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు రింగురోడ్డు వద్ద సోమవారం ఉదయం ఓ టవేరా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *