Tuesday, 3 November 2026

కారు బోల్తా: మహిళ మృతి

కోదాడ పట్టణం: పట్టణంలోని 65 జాతీయ రహదారిపై కారుబోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో కోదాడ ఎన్‌ఆర్‌ఎం స్కూలు వద్ద డివై డర్‌ను ఢీకొట్టి బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలు హైదరాబాద్‌లో డెంటిన్ట్‌గా పనిచేస్తున్న డా. సుజనాచౌదరి (35)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *