*కారు బ్రేక్ కొట్టడంతో ఆటో బోల్తా* 

 పెద్దేముల్ జూలై 30 (జనం సాక్షి)
అతి వేగంగా కారు బ్రేక్స్ కొట్టడంతో ఆటో బోల్తా పడి మూడు బైకులు ధ్వంసమై ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…మండల కేంద్రంలో  పాత బస్టాండ్ సమీపంలో కేజిఎన్ హోటల్ ముందు
TS08HY8247 నంబర్ గల కారు తాండూర్ వైపు వెళుతుండగా ఆటోకు సైడ్ కొట్టి ముందుకు వెళ్లి కారు బ్రేక్ వేయడంతో ఆటోకు తగిలి హోటల్  ముందు నిల్చున్న బైక్ల పై బోల్తా పడడంతో మూడు బైకులు ధ్వంసం కాగా ఆటో లో ఉన్న వ్యక్తి మారేపల్లి గ్రామానికి చెందిన గంగారం పాపయ్య కాలుకు తీవ్రగాయాలయ్యాయి.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు..