కార్తికేయ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నోముల భగత్.
నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి,సెప్టెంబర్ 30;నాగార్జునసాగర్ విజయపురి నార్త్ టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుకూరి రాంబాబు,వసంత దంపతుల ఏకైక కుమారుడు కార్తికేయ వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలు సాగర్లో ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్తికేయను ఆశీర్వదించారు. తదనంతరం కేకును కట్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ శ్రేయోభిలాషులు హాజరయ్యారు.