వరంగల్ ఈస్ట్, మే 29 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 39 వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు దంపతుల 28వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి జన్మభూమి జంక్షన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీమాబాద్ గుండుబావుల ప్రాంతానికి చెందిన మైసమ్మ గుడి బాధ్యులు రాసముల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో సిద్ధం రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. అదేవిధంగా డివిజన్లోని పలువురు ప్రముఖులు, మహిళలు ఈ వేడుకలో పాల్గొని సిద్ధం రాజు దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, రాసమల్ల కుమారస్వామి, కడారి సదానందం, బైరిశెట్టి మల్లేశం, నరసింహరావు, కంచి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.




