Monday, 2 November 2026

కార్పోరేట్‌ స్థాయికి ప్రభుత్వ వైద్యం

డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం

వైద్యసేవల విస్తృతికి ఆస్పత్రులను ఆధునీకరణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆస్పత్రులను ఆధునీకరిస్తూ, నిధులు కేటాయించి వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో ఉన్న ఆస్పత్రులకు ఇప్పుడున్న ఆస్పత్రులకు తేడా గమనిస్తే పరిస్థితి అర్థం అవుతుంది. పాత జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు మార్చారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనాల కోసం డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఘనతను చాటుకుంది. కిడ్నీవ్యాధిగ్రస్తుతలకు ఇదో పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అవసరాన్ని బట్టి కేంద్రాలు ఏర్పాటు చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు ఆర్ధిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయని, దీంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని భావించారు. డయాలసిస్‌ ఫిల్టర్‌ ఒక సారి వినియోగించిన తదుపరి తిరిగి ఉపయోగించడానికి అవకాశం లేదని గతంలో ప్రైవేట్‌ వైద్యశాలల్లో డయాలసిస్‌ కోసం ఫిల్టర్లను చాలా సార్లు వినియోగించే వారని, పలు సార్లు ఉపయోగించడం వల్ల వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందేవి కావని అప్పట్లో ఆరోగ్యశౄఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి ఒక్కసారి డయాలసిస్‌ చేయించుకుంటే దాదాపు రూ.3వేల వరకు ఖర్చు అయ్యేదని, దాని వల్ల పేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేదని, వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వ్యాధిగ్రస్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. సరిహద్దున ఉన్న చత్తీస్‌గడ్‌, ఒరిస్సా, ఆంధప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఆరోగ్య సేవల కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తారని అన్నారు. వారికి కూడా ఈ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభ్వుతం అధికారంలోకి వచ్చిన తదుపరి పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఏ విధమైన వైద్యసేవలు అందుతాయో అధేస్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల్లో అందజేయుటకు చర్యలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో పత్రీ ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. కంటిపరీక్షలు, ఇఎన్‌టి పరీక్షలతో ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకాశాలను పొందని గ్రావిూణులు ఈ పరీక్షలతో ఊరట చెందుతున్నారు.