కార్మికుడిని భూతులు తిట్టిన గని మేనేజర్———–


సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీరాంపూర్ ఏరియా  నమస్కరించి వ్రాయునది ఏమనగా..
అయ్యా!
విషయం:- ఆర్కే 7 గని మేనేజర్ అయినటువంటి సాయి ప్రసాద్ గారు గిరిజనుడైన నన్ను “గు_ నాటకాలు దె__కు” అంటూ అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని న్యాయం చేయుట గురించి విన్నపము.
నేను అనగా ఇస్లావత్ దిలీప్ కుమార్, తండ్రి సీతారాం,ఎంఎస్ ఎన్ 4508, ఆర్కే న్యూటెక్ గని నందు బదిలీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న నేను ఈరోజు( శుక్రవారం )ఉదయం ప్రీ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని గని వద్ద నుండి ఇంటికి వస్తున్న క్రమంలో ఆర్కే సెవెన్ వద్దగల హోటల్ నందు టిఫిన్ చేయుటకు వెళ్తున్న నన్ను ఆర్కే సెవెన్ మేనేజర్  సాయి ప్రసాద్  నా ద్విచక్ర వాహనానికి ఎదురుగా వేగంగా వచ్చి అడ్డుగా ఆపి నేనేదో నేరం చేసి పారిపోతున్న వాడిని ఆపిన విధంగా ఆపి “హెల్మెట్ పెట్టుకోలేదని” అడగగా నేను “హోటల్ వద్ద టిఫిన్ చేసి వెళ్దామని ఆగుతున్నాను సార్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను సార్” అంటూ బదులు ఇవ్వగా “నీ పేరు చెప్పు నీ మాన్ వే నెంబర్ చెప్పు” అని అడగగా “నా పేరు మరియు నా మ్యాన్ వే నెంబర్ చెప్పి నేను హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాను కదా సార్ హోటల్ వద్ద ఆగుదామని పెట్టుకోలేదు” అని చెబుతున్న క్రమంలో తాను విచక్షణ కోల్పోయి నోటికి వచ్చిన విధంగా “గు_ నాటకాలు దె__కు”…. అంటూ నానా రకాలుగా దుర్భాషలాడుతూ ఎంతో మనోవేదనకు గురి చేసిన, అవమానానికి గురిచేసిన సదరు వ్యక్తిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ…
ఇట్లుతమ విధేయుడు
ఇస్లావత్ దిలీప్ కుమార్ బదిలీ వర్కర్,ఆర్కేఎన్టి ఎంఎస్ఎన్ 4508
దీని ప్రతులు….01 సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరాంపూర్ కి02 ఆర్కె న్యూటెక్ మేనేజర్ కి03  ఆర్కే 7 గ్రూప్ ఏజెంట్ కి04 డైరెక్టర్ పా కొత్తగూడెం కి05 చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ కి06 తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కి07 చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీ కి08 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు …………జనం సాక్షి – హైదరాబాద్,