కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి…
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ. జనం సాక్షి
కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బిల్లింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలకంటి రంగారెడ్డికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 8 గంటల పని విధానాన్ని అమలు పరచాలని కనీస వేతనం అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు. పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. కార్మికుల ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, బిఎం నాయుడు, యూనియన్ అధ్యక్షులు మందరాజు నాయకులు అలీమ్, నాగుల్ మీరా, గోవర్ధన్ రెడ్డి,నజీర్, గుంట శ్రీను, కిరణ్, నాగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.