*దేశానికి దిక్సూచి సీఎం కేసీఆర్ ………జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*
*గిరిజన బంధు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో నార్నూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*
నార్నూర్. (జనం సాక్షి)
దేశానికి దిక్సూచిగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిలుస్తున్నారని ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారన్నారు. ఈరోజు నార్నూర్ మండల కేంద్రం ఆదివాసీ బంజారాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ భవనంలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక మైనవని అన్నారు.ఈ నెల 17న హైదరాబాద్ లో నిర్వహించిన ఆదివాసీ బంజారా ల భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెక్రటరీ సచివాలయానికి అంబెడ్కర్ పెరు నామకరణం చేస్తామని, గిరిజన బంధు, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంపునకు పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని అన్నారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు స్వరాష్ట్రం లో అమలు చేసున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే ఈ ఘనత దక్కుతుంది అని జడ్పీ ఛైర్మన్ అన్నారు.రాబోవు రోజులలో టీఆరెస్ ప్రభూత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గజానంద్ నాయక్, ఎంపీపీ కనక మోతు బాయి, వైస్ ఎంపీపి శేఖర్, ఎంపీపీ తనయులు ప్రభాకర్,ఉపసర్పంచ్ మహేందర్,కో అప్షన్ మెంబెర్ దస్తగిరి, సర్పంచులు రూప్ దేవ్, విష్ణు,మానిక్ రావ్, సాగర్,రామేశ్వర్, పరమేశ్వర్, రూప్ దేవ్,ప్యాక్స్ ఇంఛార్జ్ ఛైర్మన్ ఆడే సురేష్,ప్యాక్స్ డైరెక్టర్ కాంతారవ్ దుర్గే,ఎంపీటీసీ కళావతి ఉత్తమ్ ,నాయకులు న్యానోబా పుష్కర్, మాజీ ఎంపీటీసీ రమేష్, సుభాష్ రాథోడ్ మోడల్ స్కూల్ ఛైర్మన్, నాయకులు మోతె రాజన్న, దాదే అలీ, బాబా ఖాన్, షైక్ అహ్మద్, సయ్యద్ కాసిమ్,రాథోడ్ శివాజీ, సక్కారం,దేవుక బాయి, గ్రామస్తులు పాల్గొన్నారు. Attachments area
|