హైదరాబాద్,మే31(జనం సాక్షి): ఉప్పల్ స్టేడియం వద్ద మ్యాన్ ¬ల్ లో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్‌గా స్పందించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబధిత ఏజెన్సీ, సంబంధిత అధికారులపై తగు చర్యలు తప్పవని ఎండీ హెచ్చరించారు. ఈ మేరకు సంఘటనకు సంబంధించిన టెక్నికల్ డైరెక్టర్ సత్యసూర్యనారాయణను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కార్మికులకు చెరో రూ.10లక్షలు పరిహారాన్ని తక్షణమే చెల్లిస్తున్నట్లు ఎండీ ప్రకటించారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు దానకిశోర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎండీ ఆదేశాల మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ సత్యసూర్య నారాయణలు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జలమండలి జీఎం కిరణ్‌కుమార్, డీజీఎం సునీల్, మేనేజర్ సత్యనారాయణ, తహసీల్దార్ రమేశ్‌కుమార్, వీఆర్‌ఓ విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.




