కార్మిక సమస్యలపై జరిగే ధర్నాకు బయలుదేరిన భవన కార్మిక సంఘం

కేసముద్రం జులై   జనం సాక్షి /గురువారం మండలంలోని భవన నిర్మాణ కార్మికుల కమిటీలు మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తొర్రూర్ లో లేబర్ ఆఫీస్ ఎదుట కార్మికుల సమస్యలపై జరిగే దర్నాకు పెద్ద సంఖ్యలో కదలి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని,వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని,60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 5000 రూపాయలు, మండల కేంద్రాలలో అడ్డా మరియు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని,కమ్యూనిటీ హాలు కట్టించాలని,బోర్డులో ఉన్న డబ్బులు కార్మికుల ఖర్చు పెట్టాలని,ప్రతి కార్మికునికి ఇంటికో మోటార్ సైకిళ్లు ఇవ్వాలని  డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాడబోయిన శ్రీశైలం మరియు మండల అధ్యక్షులు మొలక మురళి,మండల ఉపాధ్యక్షులు ఎదునూరు శ్రీనివాస్,మండల నాయకులు దుంపల రాజయ్య,సొప్పరి శీను,వేముల వీరేష్,గుంజపొడుగు శ్రీనివాస్, కల్వల గ్రామ అధ్యక్షులు ఛెక్కల కటయ్య,విలేజి అధ్యక్షులు మర్రి మహేందర్,ఆవుల వెంకన్న,ఆవుల ఉప్పలయ్య ,సింగారపు వెంకన్న, ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area