మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లండి
– సీఐ గొర్ల అజయ్ బాబు
ఖానాపూర్ జూలై (జనం సాక్షి): కడెం ప్రాజెక్టు వరద గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నందున ఖానాపూర్ – మంచిర్యాల రోడ్డును కడం వద్ద మూసివేయడం జరిగిందని మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఖానాపూర్ సీఐ గొర్ల అజయ్ బాబు సూచించారు. జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డుపై తాత్కాలికంగా వాహన రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. నిర్మల్ నుండి మంచిర్యాలకు వెళ్లాలనుకునే వారు ఖానాపూర్, మెట్ పెల్లి, జగిత్యాల రోడ్డు మార్గాల ద్వారా గాని లేదా మంచిర్యాల నుండి నిర్మల్ ప్రాంతానికి వచ్చే వాహనదారులు జన్నారం, ఉట్నూర్, గుడిహత్నూర్ రోడ్డు మార్గాలలో గాని నిర్మల్ కు చేరుకోవాలని సూచించారు. వాహనదారులు గమనించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని తెలిపారు.
|