*కార్యకర్తలే పార్టీకి పునాది*

*మండల స్థాయి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి
యు.రమేష్ కుమార్*
పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి)
కార్యకర్తలే పార్టీకి పునాదిరాలని బిజెపి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ… కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి బూత్ కమిటీ పూర్తిస్థాయిలో రాబోవు రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా బూతు కమిటీలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉచిత బియ్యంతో పాటు, క్రీడామైదానాలు, మరుగుదొడ్లు, ఉజ్వలా పతకం కింద గ్యాస్ సిలిండర్లు,సుకన్య యోజన పథకం కింద 399 రూపాయలతో 10 లక్షల బీమా పథకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రజలకు చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి భద్రశ్వర్, ఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ నాయక్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బుమే నర్సింహా,జిల్లా బీజేవైఎం కార్యదర్శి రమేష్ సాగర్, జిల్లా మండల ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్, యాదయ్య గౌడ్, జగ్గు, అంజి, రవీందర్, ప్రదీప్, హరి, శ్రీనివాస్, దశరథ్, ప్రవీణ్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.