బలే బలే చిన్ని స్కూటర్…

కేసముద్రం జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రానికి చెందిన బొద్దుల శ్రీకాంత్ అనే వ్యక్తి చిన్ని స్కూటర్ పై కేసముద్రం పట్టణ రోడ్లపై వెళ్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ స్కూటర్ ను చూడగానే ఆకర్షితుడనై వెంటనే కొనుగోలు చేశానన్నాడు.ఈ స్కూటర్ బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేయడం వల్ల 30 కిలోమీటర్ల వరకు నడుస్తుందని చాలా సౌకర్యవంతంగా ఉందని,హైదరాబాదులో కొనుగోలు చేశానని వివరించాడు.