కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడు అండగాఉంటాం:
దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి.
దౌల్తాబాద్ ఆగష్టు 7, జనం సాక్షి. రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగరి సత్తయ్య తండ్రి కొంగరి బాలరాజు, అదేవిధంగా మల్లగల సాయిలు వాళ్ళ తల్లి మల్లవ్వ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆ కుటుంబాలను పరామర్శించి . జన్మనిచ్చిన తండ్రిని కానీ తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం ఇంతకంటే మించిన బాధ జీవితంలో మరొకటి ఉండదని ఆయన అన్నారు, ఆపదలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మామిడి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లగల సాయిలు తల్లి మృతి చెందగా ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఆయన అందజేశారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుడుం నర్సింగరావు, చింతకింది మంజూరు, మాజీ సర్పంచ్ కమ్మరి శ్రీనివాసాచారి, ఇప్ప వెంకట్, ,బ్యాగరి స్వామి , మాదాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.