ఎల్బీ నగర్( జనం సాక్షి ) నాగోల్ డివిజన్ రామాంజనేయ నగర్ కాలనీ, ధనలక్ష్మి కాలనీ, బృందావనం కాలనీ లలో హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం శ్రీనివాస్ , మేనేజర్ అలేఖ్య తో కలిసి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పర్యటించారు . ఈసందర్బంగా కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఈ కాలనీలలో నూతన డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కార్పొరేటర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో నూతన డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్




