Tuesday, 3 November 2026

కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 20

అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ పరిధిలోని తిరుమల ఎంక్లోవ్ వెంకటరమణ కాలని రిట్రీట్ కాలనీలలో మంగళవారం డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారులతో కలిసి పర్యటించారు. తిరుమల ఎన్‌క్లేవ్ వెంకట్రమణ కాలనీ రిట్రీట్ కాలనీలో నాలాను పరిశీలించారు.కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకువర్షం కురుస్తున్న సమయంలో నాలాలో పూడిక తీయడం నీటిని మరో చోటికి మళ్లించడంతోపాటు నాలాను పునర్నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని దీని కోసం ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ మమతకు ఫోన్ చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ లు మహేష్, ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ ఏసిపి విజయశ్రీ, కాలనీ వాసులు ఉదయ్, మధు, బల్వంతరెడ్డి, రాజసింహారెడ్డి, రాజేశ్వరరెడ్డి, రెడ్డి, ప్రేమ్, అరవింద్, కవిత, జామ, తదితరులు పాల్గొన్నారు.