నేడు బాల అదాలత్
హన్మకొండ బ్యూరో చీఫ్ 20 సెప్టెంబర్ జనంసాక్షి
బాలల సమస్యల పరిష్కారం కోసం నేడు ( బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాల అదాలత్ బెంచ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలిపారు, ఉదయం గం 10:00 ల నుండి సాయంత్రం గం 05:00 వరకు నిర్వహించే బాల అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె శ్రీనివాస రావు, సభ్యులు వై బృందాధర్ రావు,
ఏ శోభారాణి, బి అపర్ణ, సీ హెచ్ రాగ జ్యోతి,పి అంజన్ రావు,
ఏ దేవయ్య,
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ఆర్డీవో ఎం వాసూచంద్ర తదితరులు హాజరవుతున్నారని,బెంచ్ లో బాల బాలికల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని, సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ReplyForward
|