సమ్మె లో పాల్గొన్న కే ఓ సి కన్వేయన్స్ డ్రైవర్లు
టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి ): కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోయగూడెం ఓసీ లో పని చేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కేవోసీ లో మంగళవారం వారు సమ్మె లో పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కు మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు కన్వేయన్స్ డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో వెంకన్న,వేణు, నాగేశ్వరరావు, వీరన్న, పూర్ణ,శశి , చిట్టి బాబు, సునీల్, రాంబాబు,రాము, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.