Monday, 2 November 2026

కాలిఫోర్నియాలో కాల్పులు


శాన్‌డీగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డీగోలో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల్లో ఒకరిని శాన్‌డీగో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *