Wednesday, 4 November 2026

కాలేజీలోనే కుప్పకూలిన విద్యార్థిని

ఆస్పతికి తరలించగా చనిపోయిందని నిర్ధారణ

విద్యానగర్‌ ఎస్‌విఎస్‌ కాలేజీలో విషాదం

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎస్‌వీఎస్‌ జూనియర్‌ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని చందన తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. హుటాహుటిన లెక్చరర్లు చందనను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి చందన చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. ఈ కళాశాలలో విద్యార్థిని చందన(17) ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె హఠాన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.