Monday, 2 November 2026

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు

నీటిని అందుబాటులోకి తేవడమే కెసిఆర్‌ లక్ష్యం
సిద్దిపేట,ఫిబ్రవరి24(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత కష్టాలు తీరాయని అన్నారు. పనుల్లో వేగం పుంజుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయయం జరుగనుందని ఎఫ్‌డిసి ఛైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో పిటిషన్లు వేశారని తెలిపారు. కానీ ఆ పిటిషన్లను కోర్టులు కొట్టివేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమంటే.. రాష్ట్ర ప్రగతిని, రైతుల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కలలను నిజం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ తయారు కావడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ నేతలు పాకులాడుతున్నారని మండిపడ్డారు. చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది ఎవరో రైతులు, ప్రజలు గమనిస్తున్నారని వంటేరు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలకు రైతులు, ప్రజలే సరిjైున సమాధానం చెబుతారని చెప్పారు. రైతులు కష్టాల్లో ఉండాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుకోవడం దురదృష్టకరమని అన్నారు.