హైదరాబాద్ 24 జనంసాక్షి:
బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల, గోదావరి వరదలపై విపక్షాల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
గోదావరికి వచ్చిన వరద కన్నా కాంగ్రెస్ , బీజేపీల కన్నీటి వరద ఎక్కువయింది
సాగర్ కట్టింది నెహ్రూ, శ్రీశైలం ప్రాజెక్టుకు పునాది నెహ్రూ కట్టింది నీలం సంజీవరెడ్డి అని చెప్తారు
తెలంగాణకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు ఎవరు కట్టిండ్రు అంటే మా రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సంకలు గుద్దుకుని చెపుతారు
కానీ తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చిన నాయకుడు .. నీటి లభ్యత ఉన్న చోటనే రీ డిజైన్ చేసి ఇంజనీరింగ్ మార్వెల్ కాళేశ్వరం ఎత్తిపోతలను కేసీఆర్ గారు నిర్మించడాన్ని కాంగ్రెస్ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ..
కేంద్ర జల వనరుల నిపుణులే ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పారు
కాంగ్రెస్, బీజేపీ నేతల అక్కసుకు అవధులు లేవు .. సొంత ప్రాంతానికి మేలు జరుగుతుంటే ఇంత దుర్మార్గంగా ఈర్షను ప్రదర్శించేవారు ఎవరూ ఉండకపోవచ్చు
కాళేశ్వరం నుండి ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని ఒకరు మాట్లాడతారు .. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది 95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడతారు
కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్లు, నిపుణులకు అసలు అవగాహనే లేనట్లు .. వీరు మాట్లాడుతున్నారు
500 ఏళ్ల తర్వాత వచ్చిన అత్యంత తీవ్ర వరదలు అని కేంద్ర జలసంఘం వెల్లడించింది
1986లో 28 లక్షల క్యూసెక్కుల వరదను కేంద్రం జలసంఘం వెల్లడించింది
కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నది వరద మట్టం
103.5 మీటర్లు ఉంటే అది వార్నింగ్ లెవెల్ గా పరిగణిస్తారు. 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తుంటే అప్పుడు డేంజర్ లెవెల్ దాటిందని చెప్పవచ్చు. 107.05 మీటర్లు- 1986 లో కాళేశ్వరం వద్ద నమోదు చేసిన అత్యున్నత వరద మట్టం (High Flood Level).
107.5 మీటర్ల ఎత్తులో కాళేశ్వరం నిర్మించడం జరిగింది .. హై లెవెల్ ను దృష్టిలో పెట్టుకునే పంప్ హౌజ్ లు నిర్మిస్తారు
ఈ సారి 14.7.22 న కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 1986 లో నమోదు అయిన HFL కు మించి 108.19 మీటర్లు నమోదు అయ్యింది
గతంలో శ్రీశైలానికి 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కర్నూలు నగరం మునిగింది
ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్ , బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు
సాగునీటి విషయంలో తెలంగాణ గొంతుకోసిన పార్టీ కాంగ్రెస్ .. నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టులు ప్రతిపాదించి దశాబ్దాల పాటు నిర్మాణాలు సాగదీశారు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రీ డిజైనింగ్ చేసి తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్చి కాళేశ్వరరావు వంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించారు
కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టిననాడు అప్పటికి పుట్టనోళ్లు మా కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగాయి. కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు మునిగింది. ప్రకృతి విపత్తు అన్న వివేకం లేకుండా మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ కట్టిన జూరాల ప్రాజెక్టులో నీటిలభ్యత కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే .. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో తీసుకున్నాం
సాదాసీదాగా ఉండే అసాధారణ వ్యక్తి పెంటారెడ్డి గారు
దేశ, విదేశాల ఇంజనీరింగ్ ప్రముఖులు పెంటారెడ్డి సలహాలు తీసుకుంటారు .. తెలంగాణ తొలి ఎత్తిపోతల పథకం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రా ఇంజనీర్ల కుట్రలను అడ్డుకుని విజయవంతంగా నిర్మించింది పెంటారెడ్డి
పెంటారెడ్డి కాళ్లుకడిగి నెత్తిన పోసుకున్నా మీ పాపాలు పరిహారం కావు .. ఆయన పాదదూళికి మీరు సమానం కారు .. ఆయన ప్రతిభ ముందు మీరు కుక్కమూతి పిందెలు .. రాజకీయాలు చేయాలనుకుంటే ప్రభుత్వం మీద చేయండి
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసింది ..
అరుదైన, అసాధారణ వ్యక్తి పెంటారెడ్డిని అవమానించడా అంటే తెలంగాణ ప్రతిభను, తెలంగాణ సమాజాన్ని అవమానించడమే .. భేషరతుగా క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ లో తప్పకుండా సమాధానం చెబుతాం
అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చింది .. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా అడగండి .. పార్లమెంటులో డిమాండ్ చేయండి
ఆల్మట్టి ఎత్తు పెంపుకూ కర్ణాటక యోచిస్తున్నది .. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ మీద మొరగడం మాని కేంద్రాన్ని నిలదీయండి .. పార్లమెంట్ లో ప్రశ్నించండి
కాళేశ్వరానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు
నేల తడిచి, పంట పండి, ఆ ప్రాజెక్టు నీళ్లు తాగిన ప్రజలే కాళేశ్వరానికి సర్టిఫికెట్ ఇస్తారు
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది కక్ష్యపూరిత వైఖరి
కేంద్రం తీసుకున్న బియ్యానికే డబ్బులు చెల్లిస్తుంది ..
పీయూష్ గోయల్ విఫలమంత్రి .. నేను ఛార్టెడ్ అకౌంటెంట్ .. అనుకోకుండా పౌరసరఫరాల శాఖ నాకు వచ్చింది .. నేను తప్పనిసరై భరిస్తున్నాను .. నాకు వ్యవసాయం మీద అవగాహన లేదు అని స్వయంగా ఆయనే చెప్పాడు
ఆయన తెలంగాణ ప్రభుత్వం గురించి .. కేసీఆర్ గారి గురించి మాట్లాడడం విడ్డూరం
కేంద్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఓ విధి, విధానం అంటూ లేదు
బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల, గోదావరి వరదలపై విపక్షాల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు




