హైదరాబాద్ : మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర మంత్రి కావూరికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ. 210 కోట్ల అంచనాతో కామన్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. మరమగ్గాల కార్మికులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని, పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల తర్వాత సిరిసిల్ల పర్యటనకు మంత్రి కావూరి సుముఖుత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తెలంగాణపై కావూరి బాధ్యత కలిగిన వ్యాఖ్యలు చేశారని… ఆయన మాటాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని ఎటూ తేల్చదని మండిపడ్డారు.




