హైదరాబాద్,(జనంసాక్షి): సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి శంకర్రావు అరెస్టుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. సీఎం, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు శంకర్రావుపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్రావు అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డీజీపీ కార్యలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ నోలీసులు శంకర్రావును బుధవారం విచారించిన విషయం తెలిసిందే.




