Tuesday, 3 November 2026

కాసాలలో యువతకు ప్రతిభా పోటీలు

హత్నూర,(జనం సాక్షి)
మండలం పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన మహేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ యువతీ యువకులకు సాధారణ అంశాలపై ప్రతిభా పోటీలు నిర్వహించారు.సుమారు డెబ్భై మంది యువత పోటీలో పాల్గొని వారి సామార్థ్యాన్ని నిరూపించుకున్నారు.పోటీలో పాల్గొన్నవారందరికి పరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ మిత్రుడు కీర్తి శేషులు కొటంల మహేష్ జ్ఞాపకార్థం ప్రతి యేట ప్రతిభా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నేడు నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి.కస్తూరి ప్రథమ స్థానం, జి.వేణుగోపాల్ ద్వితియ స్థానం,ఎండి రాజిఅహ్మద్ తృతీయ స్థానంలో నిలిచారని వారు పేర్కొన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు ఈ నెల 26 న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.