Tuesday, 3 November 2026

పల్లెలకు కాలుష్యం కాటు 

దేవరకొండ జనవరి 12  (జనం సాక్షి):  చింతపల్లి మండల పరిదిలోని వింజమూరు దేవుల తండా గ్రామాలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి  నాగార్జున సాగర్ – హైదరబాద్  హైవే రోడ్డు పక్కనే ఉన్న స్టోన్ క్రషర్ దాంబర్ మిల్లు నుండి వచ్చే రాతి దుమ్ము దూళి దుర్గంద వాసన వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు, పరిశ్రమలు ఏర్పాటు చేసేముందు స్టానిక యజమాన్యాలు పర్యావరణ కాలుష్య నియంతరణ మండలినుంచి అనుమతి తీసుకోవాలి నిబందనల మేరకు స్టానిక వనరులు గ్రామాలు కాలుష్యనికి గురి కాకుండా జాగ్రతలు తీసుకోవలసి ఉంటుంది ప్రబుత్వాలు మొదట ప్రజాబిప్రాయ సేకరణ సేకరించి అక్కడి పరిస్తితులకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇస్తుంది అయితే పరిశ్రమల ఏర్పాటు సమయంలో ప్రజలకు చెప్పి సమస్యలను పరిగనంలోకి తీసుకోకుండా అనుమతులు ఇస్తున్నారు కాలుష్య నియంతరణ అధికారులు ఇచ్చే హామీలను పరిశ్రమల ఏర్పాటు చేసిన తరువాత యాజమాన్యాలు అమలు చేయడం లేదు పరిశ్రమల నుండి వెలువడే దుమ్ము కణాలు పొగ ఇతర వాయువులు గ్రామాల మీదకు రాకుండా నియంతరణ చర్యలు చేపడతామని ఆవరణలో చెట్లు పెంచుతామని వ్యర్ద జలాలను శుద్ది చేసి వినియోగించుకుంటామని ఇచ్చిన హామీలను ఏక్కడ పూర్తి స్తాయిలో అమలు చేయడంలేదు విచ్చల విడిగా వాయు కాలుష్యాన్ని పల్లెల మీదకు విడుదల చేస్తున్నారు ఈ డాంబర్ మిల్లు నుండి వచ్చే దుర్గంద వాసన పక్కనే ఉన్న దేవుల తండా ప్రాధమిక పాఠశాల విధ్యార్దులు మద్యాహ్నం  భోజనం చేసే  సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు  వాయు  కాలుష్యం వలన శ్వాస కోశ వ్యాదులకు గురయ్యే అవకాశం లేకపోలేదు ఈమిల్లుకు దగ్గరలో  పంటచెలపై ఈ రాతి దుమ్ము కణాలు పడడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైవే రోడ్డు భారీ టర్నింగ్ వద్ద ఈ పరిశ్రమ ఉండడంతో వాహన చోదకులకు దుమ్ము కళ్ళలో పడడంతో ఏదురుగా ఓవర్ స్పీడుతో  వచ్చే వాహనాలను చూడలేక కళ్ళలో కనతలు ఏర్పడి ప్రమాదలకు గురి అవుతున్నారు దేవుల తండా వింజమూర్ గ్రామాలలో ఈ దుమ్ము రాతి కణాలు  దుర్గంద వాసన వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురైతున్నారు వ్యాదుల బారిన పడకుండా సంబందిత అదికారులు ఈ కాలుష్యాన్ని కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు..