Wednesday, 4 November 2026

కాసేపట్లో ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర

ఆదిలాబాద్:కొరటికల్ నుంచి కాసేపట్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కిసాన్ సందేశ్ యాత్ర ప్రారంభం కానుంది. కొరటికల్‌తో పాటు రాహుల్ పాదయాత్ర మరో నాలుగు గ్రామాల్లో కొనసాగనుంది. లక్ష్మణ్‌చాందా, పొట్టుపల్లి, రాచాపూర్, వాడియల్ గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలకు పంటనష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వాడియల్‌లో ఏర్పాటు చేసే రైతు సభలో ఆయన మాట్లాడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *