Wednesday, 4 November 2026

కాసేపట్లో రేవంత్ బెయిల్ పిటిషన్ పై తీర్పు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం ఉన్నందున కనీసం రెండు రోజులైనా బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకావముందని ఏసీబీ ప్రత్యేక న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపంచారు. ఒక రోజు బెయిల్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బెయిల్ పిటిషన్ పై వానదలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *