Wednesday, 4 November 2026

కాసేపపట్లో సత్యం కేసులో తీర్పు

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. దాదాపు ఐదేళ్లపాటు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో నిందితులుగా సత్యం సంస్థ చైర్మన్ రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ వో వడ్లమాని శ్రీనివాస్, ఎస్. గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రామకృష్ణ, విఎస్. ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్.శ్రీశైలం ఉన్నారు. సీబీఐ సమర్పించిన 3 వేల 37 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి.. ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది. తీర్పును రిజర్వు చేసింది. ఇటు సత్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *