Monday, 2 November 2026

కిడ్నాప్ కు గురైన సంజిత్ క్షేమం..

 హైదరాబాద్ : నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలో మంగళవారం రాత్రి కిడ్నాప్ కు గురైన బాలుడు సంజిత్ (8)ను పోలీసులు క్షేమంగా రక్షించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మంగళవారం రాత్రి సంజిత్ ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు సంజిత్ ను అపహరించారు. సమాచారం తెలుసుకున్న సంజిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి సంజిత్ కోసం గాలించారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో దుండగులు బోయిన్ పల్లిలో వదిలేసి వెళ్లారు. పోలీసులు అక్కడకు చేరుకుని సంజిత్ ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. బాలుడి తండ్రి షాపులో పనిచేసే విజయ్ కుమార్ అనే వ్యక్తి దీనికంతటికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *