కివి పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కివి పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీమాబాద్ కీవి పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మూడవ రోజు అయిన సోమవారం బతకమ్మ సంబరాలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ సంబరాలు నిర్వహించారు తెలంగాణ సంస్కృతిని ఇనుమడింపజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాఠశాల ప్రిన్సిపల్ దాసి సతీష్, పైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, పాఠశాల పాఠశాల డైరెక్టర్ దాసి రజని తన అధ్యాపక బృందం పాల్గొన్నారు