కుబీర్ లో రైతు బీమా నామిని పత్రాల సేకరణ

కుబీర్ ( జనం సాక్షి ); కుబీర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం పట్టేదర్ సాల శ్రీనివాస్  అనే రైతు మరణించారు. ఇతనికి సంబంధించిన నామిని  సాల రాజమణి నుంచి నామిని పత్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కందూరు సంతోష్, స్థానిక సర్పంచ్ మీరా విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుప్పాల పిరాజి తో కలిసి వారి ఇంటికి వెళ్లి నామిని పత్రాలను స్వీకరించారు. త్వరలో వీరికి ఐదు లక్షల రూపాయలు మందులు అవుతాయని తెలిపారు.  ఈకార్యక్రమంలో నిరంజన్, దశరథ్, వెంకటి, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.