Tuesday, 3 November 2026

కులవృత్తులకు సిఎం కెసిఆర్‌ ప్రోత్సాహం

రెండో విడత చేపపిల్లల పంపిణీ: తలసాని

సంగారెడ్డి,ఆగస్ట్‌30 : కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈసారి 70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని దేశంలోనే ఎక్కడా చేపట్టలేదన్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరులో రెండో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. మత్స్య సహకార సంఘాలను పటిష్టం చేయడానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేపల మార్కెటింగ్‌ కోసం సబ్సిడీపై వాహనాలు

సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అటు రూ. 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినట్లు తెలిపిన తలసాని.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17లక్షల 50వేలకు పైగా గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో 100 సంచార పశు వైద్యశాల వాహనాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అటు వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్దిని మూడేళ్లలో చేసి చూపించినట్లు తలసాని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తలసాని తెలిపారు. రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినమని. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.