Tuesday, 3 November 2026

కుల మతాలకు అతీతంగా జరుపుకునేదే అలయ్.. బలయ్

వ‌ట్‌ప‌ల్లి( జనం సాక్షి) శనివారం
కుల మతాలకు అతీతంగా జరుపుకునేదే అలయ్.. బలయ్ కార్యక్రమమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎం ఎల్ సీ, కవి రచయత గోరేటి వెంకన్న లు అన్నారు.   ద‌స‌రా  పండుగను పుర‌స్క‌రించుకొని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో మండ‌ల కేంద్ర‌మైన వ‌ట్‌పల్లి యార్డులో  నిర్వ‌హించిన అల‌య్‌ బ‌ల‌య్ కార్య‌క్ర‌మం అదిరిపోయింది.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన   ఎమ్మెల్సీ, రచ‌యిత గోరేటి వెంక‌న్న తెలంగాణ ప్ర‌భుత్వం  ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను  పాట‌ల రూపంలో వివ‌రించారు. ఇందులో భాగంగానే సింగ‌ర్స్‌, రైట‌ర్స్ మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్, మ‌ధుప్రియతోపాటు వారి బృందం పాడిన పాట‌లు, జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ఆర్టిస్ట్ ర‌చ్చ ర‌వి చేసిన క‌మెడీయ‌న్  అంద‌రిని ఆక‌ట్టుకునేలా  చేశాయి.  ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ  బీబీపాటిల్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి ఎంత‌గానో  కృషి చేస్తుంద‌న్నారు. అలాగే ఎమ్మెల్యే క్రాంతికిరణ్  అందోల్ నియోజవ‌ర్గ అభివృద్ధే ధ్యేయంగా  ప‌ని చేస్తూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌న్నారు.  అంద‌రికి ఒక్క‌టి చేసేలా  ఎమ్మెల్యే క్రాంతికిర‌ణ్  అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌ను ఆహ్వానించి ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లను క‌లుసుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. అనంత‌రం ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న మాట్లాడుతూ నిబ‌ద్ద‌తో ఉండే వ్య‌క్తి క్రాంతి.. సంక్రాంతి అని, ఆయ‌న జ‌ర్న‌లిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నార‌ని గుర్తు చేశారు. అందుకే లోక‌ల్  నాయ‌కున్ని ప్ర‌జ‌లు గెలుపించుకున్నార‌న్నారు. ఈ  కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన జ‌నాన్ని చూసి అల్లాదుర్గం బేతాళ‌స్వామి జాత‌ర గుర్తుకొస్తుంద‌న్నారు.   అలాగే  తెలంగాణ ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను  పాటల రూపంలో వివ‌రించారు. అనంత‌రం ప్రెస్ అకాడ‌మి చైర్మ‌న్  అల్లం  నారాయ‌ణ  మాట్లాడుతూ  తెలంగాణ  రాష్ట్రంలో  ఇద్ద‌రు మాత్ర‌మే అల‌య్ బ‌ల‌య్ ప్రోగ్రామ్ ను నిర్వ‌హిస్తార‌ని, అది కూడా బీజేపీ నేత, గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్ లు  అని  గుర్తు చేశారు. కాని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని ముంచుతున్నార‌ని, అందుకే   బీజేపీ నేత  బండారు ద‌త్తాత్రేయ   నిర్వ‌హిస్తున్న అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మానికి తాను వెళ్లడం లేద‌న్నారు. కాని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్  గ‌త  నాలుగేళ్లుగా  నిర్వ‌హిస్తున్న అల‌య్  బ‌ల‌య్ కార్య‌క్ర‌మం అంద‌రిని క‌లిపి ద‌సరా పండుగ శుభాకాంక్ష‌లు తెలుపుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అలాగే ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల  అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన పాద‌యాత్ర‌లో బాగంగా అందోల్ ఎ మ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు.  ఏదైనా  మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంద‌ని వైఎస్ ష‌ర్మిల‌పై  ఆగ్ర‌హం  వ్య‌క్తం చేశారు.  క్రాంతి అంటే జ‌ర్న‌లిస్టు అని.. జ‌ర్న‌లిస్టుగా ప్ర‌స్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్ర‌జ‌ల‌కు అంద‌బాటులో ఉంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎంత‌గానో కృషి చేస్తున్నార‌న్నారు.
  అలాగే  మంచి చెడుల‌ను జ్ఞాప‌కం చేసుకునేందుకు  అల‌య్ బల‌య్  ప్రోగ్రామ్ గుర్తు చేస్తుంద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి తెలంగాణ  రాష్ట్రం ఎంత‌గానో  కృషి చేస్తుంద‌న్నారు.   అలాంటి వ్య‌క్తిపై ప్ర‌తిప‌క్ష  నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదన్నారు. అంత‌కు ముందు  కార్య‌క్ర‌మం  వ‌ద్ద జంబి చెట్టు స‌మీపంలో దుర్గా మాతను ఫోటోను పెట్టి ఎమ్మెల్యే క్రాంతికిర‌ణ్   కుటుంబ స‌భ్యులు పూజ‌లు నిర్వ‌హించి  కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో  టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు చంటి రాహుల్ కిర‌ణ్‌  మ‌ఠం బిక్ష‌ప‌తి, పైతర సాయికుమార్‌, ఎంపీపీ ప‌త్రి కృష్ణవేణి న‌ర్సింలు, జ‌డ్‌పీటీసీ అప‌ర్ణ శ్రీ‌కాంత్,  మునిప‌ల్లి ఎంపీపీ శైలజ‌,  టీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు గోపాల్‌,
 స‌ర్పంచ్ సురేఖ బుద్దిరెడ్డి, టీఆర్ఎస్ మండ‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీ రావు,  వైస్ ఎంపీపీ నాగ‌రాణి బ‌స్వ‌రాజ్‌, ఎంపీటీసీ ఇందిరాబాయి రాజేంద‌ర్‌,  రైతుబంధు మండ‌ల అధ్య‌క్షుడు అశోక్‌గౌడ్ తోపాటు అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలోని  ఆయా  మండ‌లాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, నాయకులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.