సీనియర్ జర్నలిస్టు పుర్మ రాంరెడ్డి మృతి
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : చేర్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుర్మ రాంరెడ్డి (60) శనివారం తెల్లారుజామున గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఓ దినపత్రికలో జర్నలిస్టుగా సేవలందించారు. ప్రస్తుతం రెడ్డి సంక్షేమ సంఘం జెఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. వారి మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, ప్రాంత ప్రజలు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.